![]() |
![]() |

బుల్లితెర మీద ఆర్జీవీ ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యి బిగ్ బాస్ షోకి వెళ్లి ఇంకా ఫేమస్ ఐన ఆరియానా గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అలాంటి ఆరియానా ఒక చిట్ చాట్ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "ఆరియానా అనేది రీల్ నేమ్..అర్చన అనేది రియల్ నేమ్. కాలేజ్ డేస్ లో నా క్రష్ నాగ సౌర్య. ప్రస్తుతానికి ట్రెండ్ మారుతున్నట్టు క్రష్ కూడా మారుతూనే ఉంటుంది. పార్టనర్ ఇన్ క్రైమ్ లో టైంని బట్టి చాలా మంది ఉంటారు. లిమిటెడ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నా అందరూ క్రైమ్ చేసేవాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు అమరదీప్ చౌదరి అండ్ రోల్ రైడా...అమరదీప్ మూవీలో ఐతే నేను స్పెషల్ సాంగ్ చేస్తాను. అమర్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ కాబట్టి నా మైండ్ సెట్ ఏంటి అనేది బాగా తెలుసు. ఒకవేళ బాగా చేయకపోయినా ఎక్ష్ప్లైన్ చేసి మరీ చేసేలా చేస్తాడు. కానీ సోహైల్ మూవీ స్పెషల్ సాంగ్ సరిగా చేయకపోతే కోప్పడతాడేమో అని భయం. నేను ట్రోల్ల్స్ ని పట్టించుకోను. పట్టించుకుంటే బాధపడతాను కాబట్టి. బాధపడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇగ్నోర్ చేస్తా. ఆర్జీవీ ఇంటర్వ్యూ ... ఎవరీ అమ్మాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఐతే బిగ్ బాస్ ద్వారా జనాలకు నేను ఏంటి నా ఐడెంటిటీ ఏంటి అనేది తెలిసింది. అమరదీప్ సాంగ్ కుకు కుమారి సాంగ్ కి రీల్ చేద్దామని వెళ్లి చేసాను. ఐతే ఆ సాంగ్ ఇంకా వైరల్ కావాలని అనుకున్నాం దాంతో ఫైనల్ గా రా అమర్ నిన్ను ఎత్తుకుంటా అని చెప్పి ఎత్తుకున్నా ..అలా ఎత్తుకున్న తర్వాత నాకు రెండు రోజులు బ్యాక్ పెయిన్ వచ్చింది. నేను మూవీస్ లో చేస్తున్నా.
.webp)
రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు అనే మూవీలో చిన్న రోల్ చేసాను. ఇంకా కొన్ని మూవీస్ లో నటించా ఐతే ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నా. నాకు మూవీస్ బాగా కనిపించాలని ఉంది. ఎక్కువశాతం వెజ్ అప్పుడప్పుడు నాన్ - వెజ్. నాకు గ్రీనరీ అంటే ఇష్టం. ట్రెక్కింగ్ కి మౌంటైన్స్ కి వెళ్తుంటా. గ్రీనరీ అంటే ఇష్టం కాబట్టి ఒక పల్లెటూళ్ళో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను. నేను పల్లెటూరిలో పెరగలేదు. బిగ్ బాస్ తర్వాత సంబంధం లేని ఊరిలో ఇల్లు కట్టుకున్న. ఆ ఇంటి కలర్ కూడా గ్రీన్ గా ఉంటుంది. చుట్టూ పొలాలు ఉంటాయి. వీకెండ్స్ లో అక్కడ వంట చేసుకుని పొలాల్లో తిరుగుతూ స్పెండ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సిల్వర్ స్క్రీన్ అంటే ఇష్టం. టాలీవుడ్ అంటే ఇష్టం..బాలీవుడ్ ఎప్పుడూ ఇంటరెస్టింగ్ ఉంటుంది. కానీ టాలీవుడ్ లో ప్లాన్ చేస్తున్నా కాబట్టి ప్లీజ్ దేవుడా టాలీవుడ్ లో ఐనా బాలీవుడ్ ఐనా లైఫ్ లో మంచి జరిగేలా చూడు స్వామీ. షోస్, మూవీస్ అంటే ఇష్టం లేదు అని కాదు..ప్రెజెంట్ వెబ్ సిరీస్ అంటే ఇష్టం ఉంది." అంటూ చెప్పుకొచ్చింది.
![]() |
![]() |